ముగించు

జిల్లా పరిశ్రమల కేంద్రం

చిన్న తరహా పరిశ్రమలకు కావలసిన సేవలు మరియు సదుపాయాలు ఒకేచోట నుండి కల్పించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 1978 లో జిల్లా పరిశ్రమల కేంద్రములను స్థాపించడం జరిగినది.

ప్రధాన విధులు:

  • చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించుట.
  • సింగిల్ డెస్క్ పాలసీ ద్వారా పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, ప్రభుత్వ స్థలాలు యిప్పిoచుట.
  • అరుదైన  ముడి పదార్థాలను (బొగ్గు, ఆల్కాహాల్) పరిశ్రమలకు సిఫార్సు చేయుట.
  •  ప్రభుత్వ రాయితీల మంజూరు/విడుదల కొరకు సిఫార్సు చేయుట.
  • ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకము ను నిర్వహించుట.

కడప జిల్లాలో  పారిశ్రామిక ప్రగతి:

  • ౩౦ భారీ మరియు మెగా పరిశ్రమలు 13,228.37 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి 17360 మందికి ఉపాధి కల్పించుచున్నవి.
  • 13 భారీ మరియు మెగా పరిశ్రమలు 19175.76 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించుటకు ప్రతిపాదనలు వివిధ దశలలో ఉన్నవి.  వీటి వలన 11289 మందికి ఉపాధి కల్పించబడును.
  • 2711 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు 1100.10 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి 37581 మందికి ఉపాధి కల్పించుచున్నవి.

ఇతర వివరములకు www.apindustries.gov.in ను సందర్శించండి.